నేరాలకు అడ్డాగా మారుతున్న ఇళ్లు.. ఇంటి ఓనర్లకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక!
అద్దెదారుల పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి నిబంధనలు మీరితే జరిమానాతో పాటు ఆస్తుల సీజ్ హాక్ ఐ యాప్ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు నగరంలో నేరాల నియంత్రణ కోసమే ఈ చర్యలు భాగ్యనగరంలోని ఇంటి యజమానులకు పోలీసు యంత్రాంగం కీలక హెచ్చరికలు జారీ చేసింది. నివాసాలను అద్దెకు ఇచ్చేటప్పుడు ఆ వివరాలను తప్పనిసరిగా పోలీసులకు సమర్పించాలని, అద్దెదారుల పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని,...