కొమురవెల్లికి రైలు సౌకర్యం
దశాబ్దాల నిరీక్షణకు తెర.. భక్తులకు నేటి నుంచి కొత్త ప్రయాణం నాలుగు డెమో రైళ్లకు హాల్టింగ్ ఏర్పాటు తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రంగా పేరొందిన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకునే భక్తులకు ఇకపై రైలు ప్రయాణం కూడా అందుబాటులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, మెదక్ ఎంపీ ఎం. రఘునందన్‌రావు ఈ స్టేషన్‌ను ప్రజలకు అంకితం చేయనున్నారు. ప్రారంభం రోజునే సికింద్రాబాద్–సిద్దిపేట మార్గంలో నడిచే...