అంజమ్మకు న్యాయం చేయాలి: పీడీఎస్‌యూ
శెనార్తి మీడియా, మంచిర్యాల: దండేపల్లి మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని అంజమ్మ సప్లిమెంటరీ పరీక్ష రాసినా ఫెయిల్ చేసిన ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకుని విద్యార్థినికి న్యాయం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షకు హాజరైన విద్యార్థినిని గైర్హాజరైనట్లు జిల్లా ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి, అదనపు కలెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేయడం బాధాకరమని అన్నారు. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని జిల్లా...