బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి

శెనార్తి మీడియా, మంచిర్యాల: పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో పాటు ప్రస్తుతం పాలనలో ఉన్న బీజేపీ కూడా బిల్లును ప్రవేశపెట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు....