SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 4:18 pm Posted by : SHENARTHI MEDIA

ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశం

శెనార్తి మీడియా, బోథ్: యువతకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి దిశగా అడుగులు వేయాలని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో ప్రథమ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడతాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో సంప్రదిస్తే సంస్థ ఖర్చులతో శిక్షణకు పంపిస్తామని వెల్లడించారు.
ప్రథమ్ కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో నిర్వహించే ఈ శిక్షణలో హోటల్ మేనేజ్‌మెంట్, సోలార్ టెక్నాలజీ, మిషినిస్ట్, టూ వీలర్ రిపేర్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శిక్షణకు అయ్యే పూర్తి వ్యయాన్ని సంస్థే భరిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి సహకరించిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ చంద్రకాంత్‌రెడ్డి, కుట్టు మిషన్ కేంద్రం ఇన్‌చార్జి శ్రీజ, విద్యార్థులు పాల్గొన్నారు.