ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశం

శెనార్తి మీడియా, బోథ్: యువతకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి దిశగా అడుగులు వేయాలని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో ప్రథమ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు ఈ ఉచిత శిక్షణను...