వర్షాల కోసం శివాలయంలో ఘటాభిషేకం

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని శివాలయంలో గ్రామస్థులు సోమవారం ఘటాభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య శివలింగానికి పవిత్ర జలాలతో ఘటాభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం గ్రామ మహిళలు, భక్తులు గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించి వర్షాభావ పరిస్థితులు తొలగి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ పూజల్లో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు  -శెనార్తి మీడియా, శంకరపట్నం