గోరింటాకు శుభానికి సంకేతం
శెనార్తి మీడియా, శంకరపట్నం: ప్రతి శుభకార్యంలో గోరింటాకు శుభానికి ప్రతీకగా నిలుస్తుందని మొలంగూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ తెలిపారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన మెహందీ ఉత్సవంలో ఆమె పాల్గొని విద్యార్థులకు గోరింటాకు ప్రాముఖ్యత, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని వివరించారు. గోరింటాకు శరీరంలోని అధిక వేడిని తగ్గించడంలో తోడ్పడటంతో పాటు ఫంగస్, బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. ప్రతి ఇంట్లో శుభకార్యాలకు...