ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు నిర్మించాలి
శెనార్తి మీడియా, శంకరపట్నం: ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గీత సూచించారు. మంగళవారం శంకరపట్నం మండలం కేశవపట్నం రైతు వేదికలో తెలంగాణ జలసిరి పోస్టర్‌ను సర్పంచులతో కలిసి ఆవిష్కరించి ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో మురుగునీటి సమస్య నివారణకు కామన్ సోక్‌పిట్లు నిర్మించాలని సూచించిన ఆమె, వాటి ద్వారా మురికి కాలువల నుంచి దుర్వాసన వ్యాపించకుండా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ...