కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
శెనార్తి మీడియా, బెజ్జంకి: మండలంలో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ చేపట్టి అవసరమైన చోట కొత్త పోలింగ్ స్టేషన్లు, అదనపు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలని బీజేపీ బెజ్జంకి మండల శాఖ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించింది. అలాగే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల ప్రజలు పోలింగ్ కేంద్రాలకు దూరంగా వెళ్లాల్సి వస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు ఇబ్బందులు లేకుండా...