ఉపసర్పంచ్‌ల డిమాండ్లపై వినతిపత్రం
ఉపసర్పంచ్‌ల డిమాండ్లపై వినతిపత్రం శెనార్తి మీడియా, కరీంనగర్/శంకరపట్నం: ఉపసర్పంచ్‌ల హక్కులు, బాధ్యతలను పరిరక్షించి స్థానిక సంస్థల్లో వారి పాత్రను మరింత బలోపేతం చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించింది. జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్‌లు అదనపు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్‌లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని కోరారు. గ్రామపంచాయతీ అభివృద్ధి...