ఎస్‌ఐఆర్ నమోదు శాతం 100కు చేరాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం: మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేలా బీఎల్‌ఏ–2లు సమన్వయంతో పనిచేయాలని బీజేపీ మండల సంయోజకుడు మేకల ప్రభాకర్ యాదవ్ పిలుపునిచ్చారు. శంకరపట్నం మండలంలోని మొలంగూర్ పరిధిలో లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ బూత్ స్థాయిలో కమిటీలు మరింత పటిష్టంగా పనిచేస్తూ ప్రతి అర్హుడైన...