ప్రత్యేక ఓటరు జాబితా సవరణను విజయవంతం చేయాలి

శెనార్తి మీడియా, రామగుండం:  ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేసి ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమరపు లావణ్య పిలుపునిచ్చారు. బీజేపీ చేపట్టిన మండల ప్రవాస్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీనగర్ మండలంలోని అశోకనగర్, అడ్డగుంటపల్లి, లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. రామగుండం ఎస్‌ఐఆర్ జాయింట్ కో-ఆర్డినేటర్ కోడూరి రమేష్, మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, బూత్ అధ్యక్షులతో కలిసి ఓటరు నమోదు, పేర్ల సవరణ...