ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

శెనార్తి మీడియా, కరీంనగర్ : తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా చైర్మన్ జి.ఎస్. ఆనంద్ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని తారక హోటల్‌లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార యూనియన్...