భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి:సీపీ అంబర్ కిషోర్ ఝా

 వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటన ప్రమాదకర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ముందస్తు చర్యలు శెనార్తి మీడియా, మంచిర్యాల: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. బుధవారం మంచిర్యాల జోన్ పరిధిలోని పాత మంచిర్యాల వద్ద రాళ్లవాగును పరిశీలించిన అనంతరం ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రాళ్లవాగులో వరద ఉద్ధృతి పెరగడంతో పాత మంచిర్యాల ప్రాంతానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని సీపీ తెలిపారు. ప్రజల...