SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 1:09 pm Posted by : SHENARTHI MEDIA

వార్డు మెంబర్ల ఫోరం మానకొండూరు ఇన్‌చార్జిగా శ్రీకాంత్ యాదవ్

శెనార్తి మీడియా, మానకొండూరు:

మానకొండూరు మండల వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జిగా గడ్డి శ్రీకాంత్ యాదవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలికి శ్రీకాంత్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

మండలంలోని వార్డు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వార్డు సభ్యుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఫోరం బలోపేతానికి కట్టుబడి ఉంటానని శ్రీకాంత్ యాదవ్ వెల్లడించారు.