దూద్ బావి ప్రత్యేకతపై డీఆర్డీఓ ఆరా

శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలంలోని చారిత్రాత్మక దూద్ బావిని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి మచ్చ గీత గురువారం సందర్శించారు. బావి చరిత్ర, ప్రత్యేకత, పరిసర ప్రాంతాల విశిష్టత గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దూది బావి నీటిని స్వయంగా వెలికి తీసి తాగిన ఆమె, నీరు పాలవలె తెల్లటి రంగులో ఉండటంతో పాటు రుచికరంగా ఉందని పేర్కొన్నారు. స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ బావి నీరు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుందని తెలిసిందని తెలిపారు. దూద్ బావిని సందర్శించి అక్కడి నీటిని...