రోడ్డు దాటడమే సవాల్

శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో జాతీయ రహదారి దాటడం గ్రామస్తులకు రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. సర్వీస్ రోడ్డుకు ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన రహదారి మధ్యలో శాశ్వతంగా సిమెంట్ బారికేడ్లు నిర్మించడంతో రోడ్డుకు అవతలి వైపు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాలు, దుకాణాలు, ఇతర అవసరాల కోసం నిత్యం రహదారి దాటాల్సి వచ్చే గ్రామస్తులు ఎక్కువ దూరం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు ప్రమాదాన్ని లెక్కచేయకుండా బారికేడ్ల మధ్య నుంచి రహదారి దాటేందుకు...