భారీ వర్షాలకు అప్రమత్తం

శెనార్తి మీడియా, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాల ప్రభావంతో రహదారులపై...