శెనార్తి మీడియా, హైదరాబాద్:
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, తనకు తెలియకుండా వ్యక్తిగత క్షణాలను వీడియోగా చిత్రీకరించడంతో పాటు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన నుంచి నగదు తీసుకున్నారని ఆరోపించింది. వివాహం పేరుతో మానసికంగా వేధింపులకు గురి చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 69తో పాటు 315(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.