తక్కువ నీటి పంటలే సాగు చేయాలి: ఏడీఏ శ్రీధర్
శెనార్తి మీడియా, శంకరపట్నం: అడపాదడపా కురుస్తున్న స్వల్ప వర్షాలకు ఆకర్షితులై రైతులు అధిక విస్తీర్ణంలో వరి నాట్లు వేయవద్దని సహాయ వ్యవసాయ సంచాలకుడు ఎన్. శ్రీధర్ సూచించారు. శంకరపట్నం మండలంలోని తాడికల్, కరీంపేట గ్రామసభల్లో శుక్రవారం రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ కాల వ్యవధిలో పండే, తక్కువ నీటి అవసరం ఉండే పంటలైన పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. వర్షపు నీటిని వృథా కాకుండా ఫార్మ్ పాండ్లు,...