స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలి

శెనార్తి మీడియా, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి, జీవో నెం. 9ను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అనిల్ యాదవ్ డిమాండ్ చేశారు. జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది విద్యార్థులు...