శెనార్తి మీడియా, రామగుండం:
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్‌లో విద్యుత్ స్తంభాల కొరతతో నెలకొన్న వీధి దీపాల సమస్యకు పరిష్కారం లభించింది. ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీ, లంబాడి కాలనీల్లో అదనపు విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు శనివారం చేపట్టారు.
1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో విద్యుత్ స్తంభాలు దూరదూరంగా ఏర్పాటు కావడంతో రాత్రి వేళల్లో తగినంత వెలుతురు లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకటి కారణంగా విషపురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే ఎన్‌పీడీసీఎల్ అధికారులతో మాట్లాడి అవసరమైన ప్రాంతాల్లో అదనపు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
దీంతో కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ ఆధ్వర్యంలో, ఎన్‌పీడీసీఎల్ లైన్‌మెన్ పూర్ణచందర్ పర్యవేక్షణలో మూడు కాలనీల్లో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రజల సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌తో పాటు ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ, ఏడీఈ, ఏఈ, విద్యుత్ శాఖ సిబ్బందికి 1వ డివిజన్ ప్రజల తరఫున కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు