ఎల్‌నినోపై రైతులకు అవగాహన
శెనార్తి మీడియా, హుజురాబాద్: ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని సిర్సపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి పొద్దుటూరి సతీష్ రెడ్డి సూచించారు. హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా పెసర, మినుము, కంది, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని వివరించారు....