స్కూటీ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని జేసీఎం ఫంక్షన్ హాల్ ఎదురుగా స్కూటీ అదుపుతప్పి పడిపోవడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన భూక్యా రాములు (55) నర్సంపేటలో నివసిస్తున్న తన కుమార్తె ఇంటికి స్కూటీపై వెళ్తుండగా మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడి కనుబొమ్మ, కుడి మోకాలు, కుడి చేతి మణికట్టు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అత్యవసర...