SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:02 pm Posted by : SHENARTHI MEDIA

అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటిన ‘తేజస్’ విద్యార్థులు

శెనార్తి మీడియా, కరీంనగర్ :

కరీంనగర్ లో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్ పోటీల్లో కొత్తపల్లి లోని తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థులు  ప్రతిభ  చూపి పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు కాలేజీ చైర్మన్ సీహెచ్.సతీష్ రావు తెలిపారు. అండర్–18 జావెలిన్ త్రోలో సీహెచ్.భీమేష్ ప్రథమ స్థానం, 100 మీటర్ల పరుగు పందెంలో జి.రేవంత్, 200 మీటర్ల పరుగు పందెంలో సీహెచ్.అభిషేక్ తృతీయ స్థానం, 1000 మీటర్ల పరుగు పందెంలో బి.సిద్ధు తృతీయ స్థానం, షార్ట్పుట్లో బి.నాగరాజు ప్రథమ, జె.సాయికృష్ణ ద్వితీయ, డిస్కస్ త్రోలో బి.నాగరాజు ద్వితీయ, జె.సాయికృష్ణ తృతీయ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కరీంనగర్ జిల్లా తరఫున ఆడుతారని చెప్పారు. జిల్లాస్థాయి పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులను  ఈ సందర్భంగా ఆయన అభినందించారు.