రెండు రోజులుగా అచేతనంగా.. ఆసుపత్రికి తరలింపు

శెనార్తి మీడియా, హుజురాబాద్: హుజురాబాద్ కేసీ క్యాంపు సమీపంలోని కరీంనగర్–వరంగల్ ప్రధాన రహదారి పక్కన గత రెండు రోజులుగా అచేతన స్థితిలో పడి ఉన్న గుర్తుతెలియని వృద్ధుడిని శనివారం 108 అంబులెన్స్ సిబ్బంది హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానిక కౌన్సిలర్, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఐసీడీఎస్ సూపర్వైజర్ రమ్య రహదారి పక్కన అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధుడిని గమనించి వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. దీంతో ఈఎంటీ గూడూరి సతీష్ రెడ్డి, పైలట్ మతి గోపికృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని...