శెనార్తి మీడియా, వెబ్ డెస్క్:
అస్సాంలోని హైలాకండి జిల్లాలో 15 ఏళ్ల బాలిక హత్య కలకలం రేపింది. బంధువుల ఇంట్లో విందు నుంచి ముందుగానే ఇంటికి వచ్చిన బాలిక కొద్దిసేపటికే ఇంట్లోనే మృతదేహంగా కనిపించింది. ముఖంపై తీవ్ర గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
బాలికపై హత్యకు ముందు లైంగిక దాడి జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు జాతీయ రహదారి-6పై ఆందోళన చేపట్టారు.