వ్యవసాయ మోటార్ చోరీ
శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలం అరకండ్ల గ్రామ శివారులో వ్యవసాయ మోటార్ చోరీకి గురైంది. కన్నాపూర్ గ్రామానికి చెందిన రైతు వంగల రవీందర్ రెడ్డికి అరకండ్ల శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు వ్యవసాయ మోటార్‌తో పాటు పైపులు, విద్యుత్ వైర్లను అపహరించినట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించాడు. ఈ ఘటనపై బాధిత రైతు కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు...