యూనిస్ కుటుంబానికి రూ.1.03 లక్షల ఆర్థిక సాయం
శెనార్తి మీడియా, శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన మహమ్మద్ మైబెల్లి కుమారుడు యూనిస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటనతో చలించిన అతని ఆత్మీయ మిత్రులు రూ.46,500, క్రీడాకారులు రూ.56,500 కలిపి మొత్తం రూ.1,03,000 ఆర్థిక సహాయాన్ని సేకరించారు. ఈ మొత్తాన్ని సోమవారం గ్రామ పెద్దలు, స్నేహితులు, క్రీడాకారుల సమక్షంలో యూనిస్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు.