యాదవ విద్యార్థి వసతి గృహానికి నిధుల యాత్రపై కీలక సమావేశం

శెనార్తి మీడియా, పెద్దపల్లి: యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించనున్న యాదవ విద్యార్థి వసతి గృహ భవన నిర్మాణానికి నిధుల సమీకరణ కోసం చేపట్టనున్న యాత్రకు సంబంధించి కీలక సమావేశాన్ని ఆగస్టు 4 (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఉన్న యాదవ చారిటబుల్ ట్రస్ట్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశాన్ని యాదవ చారిటబుల్ ట్రస్ట్, అఖిల భారత యాదవ మహాసభ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సమావేశంలో యాత్ర నిర్వహణ, కార్యాచరణ ప్రణాళిక, నిధుల సమీకరణ విధానం, మండలాలు, గ్రామాల...