పోలీసుల అదుపులో దొంగలు..? కాచాపూర్‌లో కలకలం

 శెనార్తి మీడియా, శంకరపట్నం: మండలంలొని కాచాపూర్ లో   ఆదివారం రాత్రి ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసు వాహనం సైరన్ వినగానే ముగ్గురు అనుమానితులు ఓ ఇంటి పక్కకు పరుగెత్తి తప్పించుకునేందుకు యత్నించగా, పోలీసులు వారిని గమనించారు. వెంటనే గ్రామస్తుల సహకారంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను శంకరపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. వారు గ్రామంలో ఎందుకు సంచరించారు, దొంగతనాలకు పాల్పడే...