SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 2:56 pm Posted by : SHENARTHI MEDIA

కొత్తగట్టు కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి

కొత్తగట్టు కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి

శెనార్తి మీడియా, శంకరపట్నం:

శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కోరెం శ్రీధర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు ఉప్పుగల మల్లారెడ్డి తెలిపారు.

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మత్స్యగిరీంద్ర స్వామి ఆలయం ఉన్న కొత్తగట్టు గ్రామంలో బుధవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో గ్రామ శాఖ కమిటీని ఏర్పాటు చేసి శ్రీధర్ రెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నిక పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.