పెన్షన్ నిబంధనలపై బీజేపీ రాస్తారోకో

శెనార్తి మీడియా, శంకరపట్నం: కొత్త నిబంధనల పేరుతో నిరుపేదలకు సామాజిక భద్రతా పెన్షన్లు దూరం చేయొద్దని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం శంకరపట్నం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించాయి. బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో అధికారులు ఇటీవల జారీ చేసిన నిబంధనల ఉత్తర్వుల ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 57 సంవత్సరాలు నిండిన ప్రతి వృద్ధుడికి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని, 40 శాతం పైబడిన...