స్వాతంత్య్ర వేడుకలకు శ్రీకారం

శెనార్తి మీడియా, శంకరపట్నం: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శంకరపట్నం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు క్రీడా, సాహిత్య, సాంస్కృతిక పోటీలను ఘనంగా ప్రారంభించారు. ప్రిన్సిపాల్ కే. ప్రభాకర్ పోటీలను ప్రారంభించి, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. క్రీడా స్ఫూర్తి, దేశభక్తిని చాటిచెప్పే నినాదాలతో విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉత్సాహభరితంగా...