శెనార్తి మీడియా, శంకరపట్నం:
శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెలను చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం లింగమూర్తి గత ఐదేళ్లుగా ఇంటి ముందు గొర్రెలు, మేకలను పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు.
గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూడు గొర్రె పోతులు, ఒక గొర్రెను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. చోరీకి గురైన గొర్రెల విలువ సుమారు రూ.35 వేల వరకు ఉంటుందని, వాటి ద్వారానే తన కుటుంబ జీవనం సాగుతోందని లింగమూర్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి చోరీకి పాల్పడిన వారిని గుర్తించి న్యాయం చేయాలని బాధితుడు కోరాడు.