ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి
శెనార్తి మీడియా, శంకరపట్నం: పంద్రాగస్టున ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా విజయవంతానికి కేశవపట్నంలోని ఓ గార్డెన్లో శనివారం బీజేపీ శంకరపట్నం మండల సన్నాహక సమావేశం మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాడ వెంకట రెడ్డి మాట్లాడారు. జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అని, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి కుటుంబం ‘హర్...