వృద్ధ దంపతుల ఆవేదన
శెనార్తి మీడియా, శంకరపట్నం: వృద్ధాప్యంలో తమను మానసికంగా వేధించడం సరికాదని శంకరపట్నం మండలం చింతలపల్లికి చెందిన నిమ్మశెట్టి వసంత, బాబురావు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ తమ కష్టార్జితంతో సంపాదించిన వ్యవసాయ భూమిని 2021లో ఇద్దరు కుమారులకు తలా 2 ఎకరాల 20 గుంటల చొప్పున పంపిణీ చేశామని తెలిపారు. తమ జీవనాధారం కోసం ఇంటి స్థలంతో కలిపి 38 గుంటల భూమిని ఉంచుకున్నామని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఇంటి పునర్నిర్మాణానికి ఇద్దరు కుమారులు చెరో రూ.లక్ష చొప్పున...