కనుమరుగవుతున్న పిచ్చుకల కిచకిచలు

శెనార్తి మీడియా, శంకరపట్నం: ఒకప్పుడు పల్లె ఉదయానికి పిచ్చుకల కిచకిచలే నిద్రలేపేవి. ఇంటి ముంగిట, పైకప్పులపై, ధాన్యం రాశుల చుట్టూ గుంపులుగా చేరిన పిచ్చుకలు గ్రామీణ జీవనంలో విడదీయరాని భాగంగా కనిపించేవి. కానీ కాలం మారింది. పల్లెల రూపురేఖలు మారాయి. ఇళ్ల నిర్మాణశైలి నుంచి వ్యవసాయ పద్ధతుల వరకు వచ్చిన మార్పులు చిన్న పక్షుల జీవనాన్నీ ప్రభావితం చేశాయి. ఒకప్పుడు నిత్యం కనిపించిన పిచ్చుకలు ఇప్పుడు అరుదుగా దర్శనమిస్తున్నాయి. శంకరపట్నం మండలం కేశవపట్నంలో సోమవారం అంతరించిపోతున్న ఆరపిచ్చుకల గుంపు శెనార్తి మీడియా ప్రతినిధి కెమెరాకు...