మంజునాథ మిల్లులో అధికారుల దాడి
30 టన్నుల దొడ్డు బియ్యంతో లారీ పట్టివేత శెనార్తి మీడియా, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ఇతర జిల్లా నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని అన్‌లోడ్ చేస్తుండగా సివిల్ సప్లైస్, టాస్క్‌ఫోర్స్ అధికారులు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా సుమారు 30 టన్నుల బియ్యంతో ఉన్న లారీని అధికారులు పట్టుకున్నారు. మిల్లులో బియ్యం అన్‌లోడ్ చేసేందుకు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా అనే అంశంపై అధికారులు ఆరా తీశారు. పట్టుబడిన...