రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో పెట్టాలి

శెనార్తి మీడియా, శంకరపట్నం: స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పక్కనపెట్టి, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బియ్యం అందిస్తున్నట్లు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆదివారం శంకరపట్నం బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం పంపిణీ చేయనున్న స్మార్ట్‌ రేషన్‌...