SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 11:48 pm Posted by : SHENARTHI MEDIA

నేటి నుంచి మండల స్థాయిలో ప్రజావాణి

శెనార్తి మీడియా, శంకరపట్నం:
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శంకరపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని ఎంపీడీవో అనిత తెలిపారు.

మండల ప్రజలు తమ వినతులను ప్రజావాణిలో సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడే తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవచ్చని వివరించారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.