SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 11:38 pm Posted by : SHENARTHI MEDIA

తాడికల్‌లో రోడ్డు ప్రమాదం

శెనార్తి మీడియా, శంకరపట్నం:
తాడికల్ రాజీవ్ రహదారి నూతన బ్రిడ్జి వద్ద టీవీఎస్ ఎక్సెల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో తాడికల్ గ్రామానికి చెందిన జక్కని వెంకటస్వామి (55) తీవ్రంగా గాయపడ్డారు. పెద్దమ్మ గుడి వద్ద స్నేహితుడిని కలసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో వెంకటస్వామి రోడ్డుపై పడిపోయారు. తలకు, ముక్కుకు, పెదాలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ గూడూరి సతీష్‌రెడ్డి, పైలట్ ఎల్లా గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.