తాడికల్‌లో రోడ్డు ప్రమాదం

శెనార్తి మీడియా, శంకరపట్నం: తాడికల్ రాజీవ్ రహదారి నూతన బ్రిడ్జి వద్ద టీవీఎస్ ఎక్సెల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో తాడికల్ గ్రామానికి చెందిన జక్కని వెంకటస్వామి (55) తీవ్రంగా గాయపడ్డారు. పెద్దమ్మ గుడి వద్ద స్నేహితుడిని కలసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో వెంకటస్వామి రోడ్డుపై పడిపోయారు. తలకు, ముక్కుకు, పెదాలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఈఎంటీ గూడూరి సతీష్‌రెడ్డి, పైలట్ ఎల్లా గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ...