కల్యాణలక్ష్మి రద్దు చేస్తే బుద్ధి చెబుతారు
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే కవ్వంపల్లిపై తీవ్ర ఆరోపణలు శెనార్తి మీడియా, శంకరపట్నం: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు లేదా నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాలు తగిన బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. అదే సమయంలో రైతుల పేరిట చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తూ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు...