రైతుల పేరిట అక్రమంగా మట్టి తరలింపు

ఎమ్మెల్యే కవ్వంపల్లి, పీఏపై మాజీ ఎమ్మెల్యే రసమయి ఆరోపణలు శెనార్తి మీడియా, శంకరపట్నం: రైతుల పేరిట చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తూ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన పీఏ మురళీధర్ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. సోమవారం కేశవపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని చెరువుల మట్టిని రైతుల పంట పొలాలకు తరలించేందుకు మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉండగా, రైతుల పేరుతో సుమారు 20 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఇతరులకు తరలించారని ఆరోపించారు. మత్స్యకారులకు ఉపాధి...