SHENARTHI MEDIA
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 7:24 pm Posted by : SHENARTHI MEDIA

సన్న వడ్ల బోనస్‌కు నమోదు తప్పనిసరి

శెనార్తి మీడియా, శంకరపట్నం:

తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న వరి సాగు చేస్తున్న రైతులు రూ.500 బోనస్ పొందేందుకు తప్పనిసరిగా తమ సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ శంకరపట్నం మండల రైతులకు సూచించింది.

ప్రైవేట్ డీలర్లు లేదా సొసైటీల వద్ద విత్తనం కొనుగోలు చేసిన రైతులు సంబంధిత డీలర్ లేదా సొసైటీ నిర్వాహకుల ద్వారా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి. స్వంత విత్తనం, సీడ్ ప్లాంట్, యూనివర్సిటీ లేదా పరిశోధనా స్థానాల నుంచి విత్తనం పొందిన రైతులు సంబంధిత ఏఈవోలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.

సాగు వివరాల నమోదుకు చివరి తేదీ సెప్టెంబర్ 10, 2026. ఆన్‌లైన్‌లో సాగు వివరాలు నమోదు చేసుకున్న రైతులు మాత్రమే సన్న వడ్ల బోనస్‌కు అర్హులవుతారని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.