ఏసీబీ వలలో మొలంగూర్ జీపీఓ
రూ.20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన శ్రీనివాస్ శెనార్తి మీడియా, శంకరపట్నం: భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధం చేసి పట్టాదార్ పాస్‌బుక్ జారీ చేయడానికి రూ.20 వేల లంచం తీసుకుంటూ శంకర్‌పట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీ కార్యాలయానికి చెందిన గ్రామ పాలన అధికారి (జీపీఓ) కంపేటి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గురువారం సాయంత్రం 5.47 గంటల సమయంలో శంకర్‌పట్నం తహసీల్దార్ కార్యాలయంలో కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు ఈ ట్రాప్ నిర్వహించారు. ఏసీబీ విడుదల చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం.....