కొత్త ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ అందుబాటులోకి
శెనార్తి మీడియా, శంకరపట్నం: రైతులకు ఎరువుల బుకింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ (FFS–ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్) అందుబాటులోకి వచ్చిందని ఏవో వెంకటేష్ తెలిపారు. ఇకపై యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులను ఈ యాప్ ద్వారానే రైతులు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైతులు మొబైల్‌లోని గూగుల్ ప్లే స్టోర్ నుంచి FFS యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆధార్ లేదా ఫార్మర్ ఐడీ ద్వారా లాగిన్ కావాలి. అవసరమైన ఎరువుల బస్తాలను యాప్‌లో బుక్ చేసుకున్న అనంతరం వచ్చే...