పోతన కాలనీలో కోతులు, వీధి కుక్కల బెడద

శెనార్తి మీడియా, గోదావరిఖని: పోతన కాలనీలో కోతులు, వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కోతుల బెడదపై ఇప్పటికే ఆర్‌జీ-2 యాజమాన్యానికి పలుమార్లు సమస్యను తెలియజేసినా ఇప్పటివరకు సరైన పరిష్కారం లభించలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులతో పాటు వీధి కుక్కలు కూడా ప్రజలను వెంటాడుతూ దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. ఇటీవల కోతుల దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి...